TG: ఖమ్మం రూరల్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. పెద్ద తండాలో ఉండే ఉపేందర్, ఉమా దంపతుల కుమార్తె ఉద్దీప(20) ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉద్దీప బీటెక్ రెండో ఏడాది చదువుతోందని, గతంలో కిందపడి తలకు గాయమైందని అన్నారు. మానసిక స్థితి సరిగా లేదని, దీంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.