హర్యానాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫరీదాబాద్- గురుగ్రామ్ రహదారిపై మంగార్ పోలీస్ పోస్టు సమీపంలో అతివేగంగా వచ్చిన ఓ ట్రక్కు మారుతి ఆల్టో కారును వెనుకనుండి అతివేగంగా ఢీకొట్టింది. దీంతో కారు పల్టీలు కొడుతూ పక్కన పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులంతా పల్వాల్ కు చెందినవారని, గురుగ్రామ్ లో పార్టీకి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదంలో మరణించారని పోలీసులు తెలిపారు.