యూపీలోని వారణాసిలో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని పాఠశాలకు వెళుతుండగా విశాల్ సోంకర్ ఆమెను అడ్డుకున్నాడని ఆరోపించింది. ఇంతలో బాటసారులు గుమిగూడి హేళన చేయడం, వాదించడం మొదలుపెట్టారు. అనంతరం ఓ వ్యక్తి వచ్చి బాలికతో యువకుడిని కొట్టించాడు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.