ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్‌లో జీబ్లీ ఫోటోలు తెగ కనిపిస్తున్నాయి. ఇప్పుడు వైరల్ అవుతోన్న ట్రెండ్ ఇది. దీనిపై ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ స్పందించారు. జీబ్లీ వినియోగం ఎక్కువగా ఉందని, ఈ విషయంలో యూజర్లు కాస్త కూల్‌గా ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ‘మా సిబ్బందికి నిద్ర కూడా అవసరం కదా..! దయచేసి జీబ్లీ వినియోగం కాస్త తగ్గించండి.’ అని కోరారు.