సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆమె సోదరుడు రాజబాబు తీవ్ర అనారోగ్యంతో ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా, రాజబాబు అస్థికలను బుధవారం రాజమండ్రి పుష్కర ఘాట్‌లో కలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. రాజబాబు పుట్టింది, పెరిగింది రాజమండ్రిలోనే అని చెప్పారు. తనకు ఏ కష్టం వచ్చినా తోడుగా ఉండేవాడని, ఇప్పుడు తమను విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధగా ఉందని పేర్కొన్నారు.