తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉగాది నాటి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే లేత నీలి రంగులో ఈ కొత్త రేషన్ కార్డును తయారు చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.