TG: రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా HCU విద్యార్థులు చేస్తున్న పోరాటానికి పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మద్దతు తెలిపారు. ఈ మేరకు వారికి సపోర్ట్ చేస్తూ.. జూ.ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ చిత్రంలోని డైలాగ్‌ను రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్టు చేశారు. ‘ప్రకృతి మన సొంతం కాదు.. కొన్నాళ్లు ఇక్కడ జీవించానికి మాత్రమే మనం వచ్చాం. ఇదేదీ మన సొంతం కాదు. ఇప్పుడెలా ఉందో అచ్చం అలాగే వచ్చే తరాలకు అందించాలి’ అనే డైలాగ్‌ను పోస్టు చేశారు.