ఏబీవీపీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని బుధవారం ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి కార్తీక్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో మెరుగైన వస్తువులు కల్పిస్తూ విద్యరంగాన్ని బలోపేతం చేయాలన్నారు. ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసి కార్పొరేట్ ప్రవేట్ విద్యాసంస్థల వ్యాపారాన్ని అరికట్టాలన్నారు