నార్నూర్ మండల కేంద్రంలోని విజయనగర్ కాలనీలోని గల తైబజార్ వేలం రూ. 3 లక్షలకు పలికింది. సోమవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎంపీడీఓ జవహర్ లాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన వేలం పాటలో నలుగురు వేలం పాడారు. ఈ క్రమంలో వారిలో జాదవ్ ధన్ లాల్ రూ. 3 లక్షలకు తైబజారును దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో సికిందర్, దుర్గే కాంతారావు తదితరులు పాల్గొన్నారు.