ఆసిఫాబాద్ లో సినీ నటుడు సాయికుమార్ సందడి

82చూసినవారు
కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ లో ఆదివారం నిర్వహించే కొమురం భీం జాతీయ పురస్కార వేడుకలకు సినీ నటుడు సాయికుమార్ హాజరయ్యారు. ఆయనకు ఎంపీ నగేశ్, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మేల్యే కోవ లక్ష్మీ ఆహ్వానం పలికారు. అనంతరం కొమురం భీం విగ్రహానికి వారు నివాళులు అర్పించారు. ఆయనతో పాటు హాస్యనటుడు బాబుమోహన్, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి, నిర్మాతలు రాహుల్ యాదవ్, మాజీ ఐఏఎస్ పార్థసారధి ఉన్నారు.

సంబంధిత పోస్ట్