ఈనెల 29, 30 తేదీల్లో తూర్పు మధ్య, పరిసర ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పాడే అవకాశం ఉందని.. ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ క్రమంలో తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని సోమవారం పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.