బోథ్: జిల్లా అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు కేటాయించాలి

50చూసినవారు
ఎంపీ స్థానంతో పాటు, నలుగురు ఎమ్మెల్యేలను ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రజలు బీజేపీకి అందించిన కేంద్ర ప్రభుత్వం జిల్లాపై చిన్నచూపు చూస్తోందని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి ఆరోపించారు. బోథ్ మండలకేంద్రంలో ఆయన మాట్లాడారు. నిధులు రాబట్టడంలో బీజేపి స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు విఫలమయ్యారని పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు మంజూరుకు కృషి చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్