ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలంలోని జడ్పీ సెకండరీ పాఠశాలలో మంగళవారం తుల శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు 40 స్పోర్ట్స్ డ్రెస్సులను మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ పంపిణీ చేశారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, ఆటలు, చదువులో రాణించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు. పదవ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు.