విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సఖి కేంద్రం కేస్ సోషల్ కౌన్సిలర్ లావణ్య అన్నారు. మహిళలపై హింసకు వ్యతిరేకంగా సోమవారం గుడిహత్నూర్ మండల కేంద్రంలోని రాజీవ్ నాగర్, హనుమాన్ నాగర్ ఎస్సి కాలనీతో పాటు ప్రభుత్వ ప్రాథమికున్నత పాఠశాల, ఆదర్శ పాఠశాల కళాశాలలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. సఖి కేంద్రం అందించే సేవలు, సైబర్ క్రైమ్, చట్టాలు హెల్ప్ లైన్ నంబర్లు పై అవగాహన కల్పించారు.