గుడిహత్నూర్ లో ఉద్రిక్తత.. పోలీసులకు గాయాలు

79చూసినవారు
గుడిహత్నూర్ మండల కేంద్రంలో శనివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని కాలనీలో ఓ యువకుడు మైనర్ బాలికతో గదిలో ఉన్నాడు. విషయం తెలుసుకున్న బాలిక బంధువులు ఇంటిని చుట్టుముట్టారు. ఈ క్రమంలో నిందితుడిని అప్పజెప్పాలంటూ పోలీసులతో వాగ్వాదం చేశారు. ఇచ్చోడ సీఐ భీమేష్ కాలనీవాసులను నచ్చజెప్పి యువకుడిని అదుపులో తీసుకునే క్రమంలో వారు వాహనాలపై దాడి చేశారు. ఈ దాడిలో సీఐ తోపాటు పలువురు పోలీస్ అధికారులు గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్