తలమడుగు మండలం పల్సి కే గ్రామంలో సోమవారం విఠల రుకుంబాయి ఆలయ 5వ వార్షికోత్సవం పురస్కరించుకొని ప్రియదర్శిని యూత్ ఆధ్వర్యంలో అంతరాష్ట్ర కబడ్డీ పోటీలు నిర్వహించారు. మాజీ జడ్పిటిసి గణేశ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని బి. ఆర్ అంబేద్కర్, కొమురం భీం గాంధీ చిత్ర పటాలకు పూజలు చేసి పోటీలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కబడ్డీ క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.