మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో సంకల్ప్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ 100 డేస్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బోథ్ ఆశ్రమ పాఠశాల, గర్ల్స్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ లో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికలకు హెల్ప్ లైన్ నంబర్స్, చట్టాలు, హెల్త్ న్యూట్రిషన్స్, గుడ్ టచ్-బ్యాడ్ టచ్ పై జెండర్ స్పెషలిస్ట్ కృష్ణవేణి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిసిడిఓ ఛాయా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.