మందమర్రి: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి తెలిపారు. మందమర్రి సర్కిల్ పరిధిలో గతంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే బ్లాక్ స్పాట్ లను సోమవారం నేషనల్ హైవే అధికారుల తో పాటు పరిశీలించారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.