సారంగాపూర్ మండలం అలూర్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటి ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన గణపతి వద్ద జిల్లా ఎస్పీ డా. జి. జనకి షర్మిల ఐపిఎస్ పూజ చేసి నిమజ్జన శోభాయాత్రను శనివారం ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాలను భక్తులకు వడ్డించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ రూరల్ సిఐ రామ కృష్ణ, సారంగాపూర్ ఎస్ఐ శ్రీకాంత్, ఆలూర్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.