ALERT: పెరిగిన ఎండ తీవ్రత.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక

66చూసినవారు
ALERT: పెరిగిన ఎండ తీవ్రత.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
రాబోయే మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. పగటి వేళ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదుకావడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తెలంగాణలోని ఆదిలాబాద్, భద్రాచలం వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు, అటు ఏపీలోని కర్నూలు జిల్లాలో 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్