అలర్ట్.. నేడు HYDలో ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు

83చూసినవారు
అలర్ట్.. నేడు HYDలో ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు
HYDలో శ్రీరామనవమి శోభాయాత్రను పురస్కరించుకుని, నగర ట్రాఫిక్ పోలీసులు ఈ రోజు ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. శోభాయాత్ర సీతారాంబాగ్ ఆలయం నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగుతుంది. సీతారాంబాగ్, మంగళ్‌హాట్, పురానాపూల్, జుమ్మేరాత్ బజార్, చుడీ బజార్, బేగంబజార్ ఛత్రి, సిద్దిఅంబర్ బజార్, గౌలిగూడ, పుత్లీబౌలి మార్గాల్లో సాగుతుంది. వాహనదారులు గమనించాలని పోలీసులు కోరారు.

సంబంధిత పోస్ట్