తన యూజర్లకు జియో గుడ్ న్యూస్ చెప్పింది. IPL ప్రారంభమైన నేపథ్యంలో పలు ప్రత్యేక ప్లాన్లను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆఫర్ల గడువును పొడిగించింది. ముందు ప్రకటించిన గడువు ప్రకారం స్పెషల్ ప్లాన్లను రీఛార్జ్ చేసుకునేందుకు మార్చి 31 వరకు అవకాశం ఉండేది. ప్రస్తుతం గడువును ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. ప్లాన్లను మై జియో యాప్‌లో చూడొచ్చు.