రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పెద్ది’. జాన్వీకపూర్ కథానాయిక. శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని టీమ్ రిలీజ్ చేసిన స్పెషల్ గ్లింప్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. రామ్‌చరణ్ యాక్టింగ్, బుచ్చిబాబు మేకింగ్, రెహమాన్ మ్యూజిక్‌పై సినీ ప్రియలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమాలో ఇది హీరో సిగ్నేచర్ షాట్ అని అంటున్నారు.