ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉమ్మడి విశాఖ జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన అల్లూరి జిల్లా పెదపాడులో పలు రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే అరకు సమీపంలోని సుంకరమెట్ట వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టుకు భూమి పూజ కూడా చేయనున్నారు.