భారత ప్రధాని నరేంద్ర మోడీ విమానం నుంచి రామసేతును సందర్శించారు. 'ఎక్స్' వేదికగా సంబంధిత వీడియోను ఆయన పోస్ట్ చేశారు. ‘శ్రీలంక నుంచి తిరిగి వస్తుండగా.. రామసేతును దర్శించే భాగ్యం కలిగింది. అయోధ్యలో బాలరాముడికి సూర్య తిలకం సమయంలోనే ఇది జరగడం విశేషం. ఈ రెండింటిని చూసిన అదృష్టం నాకు దక్కింది" అని మోడీ పేర్కొన్నారు.