రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు దేశంలో మొదటిసారి సమగ్ర కుల గణన ప్రక్రియ ఈనెల 6వ తేదీన ప్రారంభమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో బుధవారం మీడియా సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. సమగ్ర సర్వే సక్రమంగా జరిగి భవిష్యత్‌లో అందరికి సమ న్యాయం జరిగేలా అందరు సహకరించాలన్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. 150 ఇళ్లకు అధికారుల బృందం సమగ్ర సమాచార సేకరణ చేపడుతుందన్నారు.