ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలోని నూర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోభారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం కారణంగా, పంచాయతీ ఆఫీసులో పార్క్ చేసిన లక్షల విలువైన వాహనాలు కాలిపోయాయి. రెండు కార్లు, ఒక బైక్ దగ్ధం అయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.