రిజర్వేషన్లపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

75చూసినవారు
రిజర్వేషన్లపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని కాంగ్రెస్ ఆరోపణలను కేంద్ర మంత్రి అమిత్ షా కొట్టిపారేశారు. రాహుల్ గాంధీ అసత్య ఆరోపణలతో దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు రిజర్వేషన్లను ఎవరూ ముట్టుకోలేరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీనే ఓబీసీల రిజర్వేషన్లను తగ్గించి వాటిని ముస్లిం మైనార్టీలకు కట్టబెడుతోందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్