అమెరికాకు చెందిన డేవిడ్ రష్ అనే వ్యక్తి సంచలనం సృష్టించాడు. ఒకే రోజులో ఏకంగా 15 గిన్నిస్ వరల్డ్ రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. అంతేకాదు ఆయన తన జీవితకాలంలో 250కి పైగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లను బ్రేక్ చేయడం విశేషం. పలు అంశాల్లో ఆయన ఈ రికార్డులు నమోదు చేశాడు. ఈ క్రమంలోనే తాజాగా లండన్‌లోని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కార్యాలయాలను సందర్శించి ప్రస్తుతం తన వద్ద ఉన్న 180 ఏకకాల మెడల్స్‌ను వేలం వేయడానికి వెళ్లాడు.