AP: విశాఖ జిల్లా తిగరపువలసలోని ఆదర్శనగర్‌లో పురుగుల మందు తాగిన ఘటనలో విషాదం చోటు చేసుకుంది. భర్తతో గొడవ పడి మనస్తాపం చెందిన వివాహిత మాధవి (25) కుమార్తెలతో పాటు తానూ పురుగుల మందు తాగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మాధవితో పాటు చిన్న కుమార్తె మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి ఇషిత (5) కూడా ప్రాణాలు విడిచింది. దాంతో చిన్నారి తండ్రి రామకృష్ణ గుండెలు పగిలేలా రోదించారు.