ఈనెల 28న షబ్ ఎ మిరాజ్ సందర్భంగా స్కూళ్లకు సెలవు ఉండే అవకాశముంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేగా పేర్కొంది. మంగళవారం మైనార్టీ విద్యా సంస్థలు హాలిడే ప్రకటించనున్నాయి. మిగతావి తమ స్వీయ నిర్ణయం ప్రకారం తరగతుల నిర్వహణ లేదా సెలవును ఇవ్వవచ్చు. జమ్మూకశ్మీర్ సహా పలు రాష్ట్రాల్లో రేపు షబ్ ఎ మిరాజ్‌కు ఆయా ప్రభుత్వాలు సెలవు ప్రకటించాయి.