పానీపూరి, గోబీ, నూడిల్స్ మీ ఆరోగ్యాన్ని హరిస్తాయి. పానీపూరిలో నింపే పానీలో ఈ-కొలి, క్లెబ్సిఎల్లా, సుడోమోనాస్, కాండిడస్, ఎంటిరోకోకై వంటి బ్యాక్టీరియాలు ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది. ఎక్కువ సార్లు వినియోగించే నూనె, మైదా, టేస్టింగ్ సాల్ట్ వినియోగం వల్ల టైపాయిడ్‌తో పాటు కిడ్నీలు పాడవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటి తయారీలో వేసే రంగుల వల్ల ఆస్తమా, అలర్జీలు, గుండె, కిడ్నీ జబ్బులు వస్తాయి.