తన వెనుక అల్లు అర్జున్ ఉన్నారనే వార్తలు అవాస్తవమని జానీ మాస్టర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన మహిళా కొరియోగ్రాఫర్ తెలిపారు. కుటుంబమే తనకు అండగా నిలిచిందన్నారు. 'జానీ మాస్టర్ జాతీయ అవార్డు రద్దుకు నాకు సంబంధం లేదు. నేను ఎలాంటి లేఖలు రాయలేదు. కొందరు కేసు వాపస్ తీసుకోమని డబ్బు ఆఫర్ చేశారు, బెదిరించారు. కానీ నేను వాటికి స్పందించలేదు. నేను ఎవరికీ భయపడను' అని ఆమె ఓ పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యానించారు.