TG: నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండలో ఓ భక్తురాలిపై అత్యాచారం ఘటనపై మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ స్పందించారు. ఈ మేరకు ఘటన స్థలాన్ని పరిశీలించిన ఐజీ కీలక వివరాలు చెప్పారు. 'మహిళను బంధించి 3 గంటల పాటు అత్యాచారం జరిపారు. ఈ ప్రాంతంలోకి ఒంటరిగా వచ్చే మహిళలను ఈ ముఠా లక్ష్యంగా చేసుకుని అఘాయిత్యాలకు పాల్పడుతోంది. డబ్బులు లాక్కుని బెదిరిస్తున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేస్తాం' అని తెలిపారు