TG: బెట్టింగ్ భూతం మరో యువకుడి ప్రాణం తీసింది. క్రికెట్ బెట్టింగ్ పెట్టి నష్టపోవడంతో రాజ్వీర్సింగ్ ఠాకూర్ అనే యువకుడు సికింద్రాబాద్లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సుచిత్రలోని బీహెచ్ఈఎల్ క్వార్టర్స్లో ఉంటున్న రాజ్‌వీర్ సింగ్ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.