ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈశాన్య ఢిల్లీకి చెందిన సోనియా విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వజీరాబాద్ మల్ఖానాలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 50 నాలుగు చక్రాల వాహనాలు, 100 ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అగ్నిప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.