TG: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి రాష్ట్ర దేవదాయ శాఖ తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఉత్సవ మూర్తులను ఆలయ అర్చకులు మిథిలా స్టేడియానికి తీసుకువచ్చారు. కళ్యాణ వేదిక మీదకు వెళ్తున్న సీతారాములకు భజంత్రీలు, కోలాటం, సంప్రదాయ నృత్యాలతో భక్తజనం స్వాగతం పలికారు. దీంతో మిథిలా స్టేడియంలో ఉన్న భక్తుల్లో కోలాహలం నెలకొంది.