TG: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు గుడ్‌న్యూస్.. రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసేందుకు రేపటి నుంచి దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 17 నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దాదాపు 5 లక్షల మంది యువతకు రూ.6 వేల కోట్ల ఖర్చుతో ప్రభుత్వం రాయితీ రుణాలను మంజూరు చేయనుంది. ఈ పథకం అర్హతలు, ఎంపిక విధానం వివరాలన్నీ https://tgobmms.cgg.gov.in/ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి.