ఒకప్పుడు ఏ వస్తువు కావాలన్నా బజారుకే వెళ్లి కొనుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడలా కాదు. ఆన్‌లైన్‌లో ఇలా ఆర్డర్ చేస్తే అలా డోర్ డెలివరీ చేస్తున్నారు. అయితే ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటించడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటివంటే.. షాపింగ్ చేసేటప్పుడు సైట్ లేదా యాప్ సరైనదో కాదో పరిశీలించాలని, అలాగే చెల్లింపు వివరాలు అస్సలు సేవ్ చేయకూడదని, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకోవడం మేలని వివరిస్తున్నారు.