సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన భద్రాచలం ఎమ్మెల్యే

82చూసినవారు
TG: గుండెపోటుకు గురైన కాంగ్రెస్ నేతకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు. భద్రాచలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరావుతో పాటు ఎమ్మెల్యే వెంకట్రావు పర్యటించారు. వారి వెంట ఉన్న వారిలో కాంగ్రెస్ నేత సుధాకర్ అనే వ్యక్తి గుండెపోటుకు గురయ్యారు. కిందపడిపోయిన ఆయనకు డాక్టర్ వెంకటరావు వెంటనే సీపీఆర్ చేశారు. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్