భట్టి అహంకారంతో మాట్లాడుతున్నారు: MLA సంజయ్

74చూసినవారు
భట్టి అహంకారంతో మాట్లాడుతున్నారు: MLA సంజయ్
TG: మోడీ దేశంలో కాంగ్రెస్ హఠావో అంటే.. తెలంగాణలో బీజేపీ నేతలు కాంగ్రెస్ బచావో అంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ఎద్దేవా చేశారు. 'బీజేపీ నేతలు రేవంత్ రెడ్డితో డీలింగ్ చేసుకుంటున్నారు. భట్టి అంటే మాకు గౌరవం ఉండేది. ఇప్పుడు ఆయన అహంకారంతో మాట్లాడుతున్నారు. గత అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని మొహం ఎక్కడ పెట్టుకుంటారని అన్నారు. నిన్న ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. భట్టి మాటలను ఉపసంహరించుకోవాలి' అని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్