AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఫ్రీ బస్సు రాష్ట్రమంతా కాదని మంత్రి సంధ్యారాణి తేల్చి చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం కేవలం జిల్లాల వరకు మాత్రమేనని వెల్లడించారు. ఏ జిల్లాలోని మహిళలు, ఆ జిల్లాల్లోనే ప్రయాణించాలని, వేరే జిల్లాకు వెళ్తే ఉచిత ప్రయాణం వర్తించదన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మాదిరి.. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణం లేదని మంత్రి సంధ్యారాణి తెలిపారు.