AP: గ్రామాల్లో ఉండే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ (సీహెచ్ఓ)కు రూ.15 వేలు ప్రోత్సాహకం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ శుక్రవారం పేర్కొన్నారు. ప్రస్తుతం 234 సీహెచ్ఓ ఉద్యోగాలకు ఖాళీలు ఉన్నాయన్నారు. బీఎస్సీ నర్సింగ్ చేసిన వారినే రూ.25 వేలు వేతనానికి CHOలుగా కాంట్రాక్టు విధానంలో తీసుకున్నామని వివరించారు. సీహెచ్ఓలు సక్రమంగా విధులు నిర్వహించేలా నిరంతరం సమీక్ష చేస్తున్నామని మంత్రి తెలిపారు.