ఉసిరికాయలను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఉసిరి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపులో ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. ఇంకా కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా షుగర్ ఉన్నవారు ఉసిరిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.