సోరకాయ వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అధిక నీటిశాతం, పీచు పదార్థం, పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్ల వల్ల సోరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. సోరకాయ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మధుమేహం ఉన్నవారు దీనిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ముఖ్యంగా కాలేయ సంబంధిత వ్యాధులకు చెక్ పెడుతుంది.