బిల్లు చెల్లిస్తూ గుండెపోటుతో యువకుడు మృతి (VIDEO)

85చూసినవారు
రాజస్థాన్‌ రాజ్‌సమంద్‌లోని హోటల్‌లో బిల్లు చెల్లిస్తుండగా గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి చెందాడు. సచిన్ (27) అనే యువకుడు అక్కడి హోటల్‌లో భోజనం చేసిన తర్వాత బిల్లు చెల్లిస్తుండగా గుండెపోటు వచ్చింది. దీంతో సడెన్‌గా కౌంటర్ వద్దే కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్