ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో BJP మండల అధ్యక్షుడు రామెల్ల శేఖర్ ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా బైరంగడ్‌కి చెందిన బాలిక తన కుటుంబంతో కలిసి కూలి పని కోసం బెస్తగూడెం గ్రామానికి వచ్చింది. నిత్యావసర సరుకుల కోసం వెళ్లిన బాలికను మార్గ మధ్యలో కాపుకాసి, బలవంతంగా బండిపై ఎక్కించుకొని అడవిలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.