సీఎంకు లేఖ రాసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

70చూసినవారు
సీఎంకు లేఖ రాసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
TG: బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం రేవంత్ రెడ్డికి తాజాగా లేఖ రాశారు. శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించే శోభాయాత్రలో ఎలాంటి అడ్డంకులు, ఆటంకాలు జరగకుండా అనుమతి ఇవ్వాలంటూ లేఖలో పేర్కొన్నారు. ఏప్రిల్ 6న ఆకాశ్ పూరి హనుమాన్ దేవాలయం నుంచి సుల్తాన్ బజార్ వరకు రామయ్య శోభాయాత్ర జరగనుంది. ఈ శోభయాత్రను 2010 నుంచి నిర్వహిస్తున్నామని, ఈ యాత్రలో లక్షల మంది పాల్గొంటారని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్