ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు.. నలుగురు మృతి (వీడియో)

75చూసినవారు
ముంబైలోని థానేలోని భారీ పేలుడు సంభవించింది. అక్కడ అంబర్ కెమికల్ కంపెనీలో బాయిలర్ పేలడంతో సంఘటనా స్థలంలోనే నలుగురు మృతి చెందగా.. 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ భారీ పేలుడు వలన ఆ ప్రాంతానికి 3 కిలోమీటర్ల దూరం వరకు పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్