TPCC చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల కృషితోనే తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఆనాడు PCC చీఫ్‌గా రేవంత్, అంతకుముందు ఉత్తమ్ పోరాటం పార్టీని నిలబెట్టాయని తెలిపారు. మేమున్నామని రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ ప్రోత్సహించారన్నారు. పదేళ్ల BRS హయాంలో కంటే, ఏడాదిలో కాంగ్రెస్ ఎన్నో చేసిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు సీఎం 56 వేల ఉద్యోగాలను ఇచ్చారని మహేష్ వ్యాఖ్యానించారు.